ఎన్టీఆర్ 30.. అభిమానులకు బ్యాడ్ న్యూస్.. రిలీజ్ డేట్ లాక్..!

-

ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని గత ఎనిమిది నెలలుగా ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేయబోయే ఎన్టీఆర్ 30 ప్రాజెక్టు ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లనుందో అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. అంతేకాదు సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో కూడా ప్రకటించి అభిమానులలో ఆనందానికి కారణం అయ్యారు చిత్రం యూనిట్. నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్టు అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా విడుదల చేస్తూ అధికారికంగా చిత్రం యూనిట్ ప్రకటించింది.

దీంతో ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ అభిమానుల నిరీక్షణకు చెక్ పెట్టినట్టు అయింది. కాకపోతే ఇదే సమయంలో మరో బాడ్ న్యూస్ కూడా ఉంది. ఎందుకంటే ఈ సినిమాని 2024 వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు ఇలా రిలీజ్ డేట్ వెల్లడించడం మంచి విషయమే కానీ ఈ సినిమా విడుదలకు ఏకంగా 16 నెలల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా ఈ న్యూ ఇయర్ వేల బిగ్ అప్డేట్ ఇచ్చినందుకు ఎన్టీఆర్ అభిమానులు సంబర పడిపోతున్నా..మరోపక్క ఈ సినిమా రావాలి అంటే ఇంకా 16 నెలలు ఎదురు చూడాలా అంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో ఇప్పుడు దర్శకుడు కొరటాల కాంబినేషన్లో వస్తున్న సినిమా పై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్లాల్సిన ఈ సినిమా ఇంకా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇకపోతే ఇప్పుడు అవుట్ పుట్ అంతా పర్ఫెక్ట్ గా వచ్చిందని.. ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సిద్ధమవుతుందని సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ తో పాటు ముఖ్యఅతిథి పాత్రలో మోహన్ లాల్ నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news