అనీల్ రావిపుడితో ఎన్.టి.ఆర్ ..!

-

ఆర్.ఆర్.ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. మే ఫస్ట్ వీక్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత తారక్ ఎవరి డైరక్షన్ లో సినిమా చేస్తాడన్నది క్లారిటీ రావాల్సి ఉంది. కొరటాల శివ, బుచ్చి బాబు లైన్ లో ఉన్నారని తెలుస్తుంది. అయితే లేటెస్ట్ గా సరిలేరు నీకెవ్వరు డైరక్టర్ అనీల్ రావిపుడి తారక్ ను కలిసి ఓ కథ వినిపించాడట. కథ నచ్చిన తారక్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పాడట.

NTR Anil Ravipudi movie is on Cards

అన్ని కుదిరితే త్రివిక్రం తర్వాత ఎన్.టి.ఆర్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని తెల్సుతుంది. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ తెలియాల్సి ఉంది. పటాస్ నుండి సరిలేరు నీకెవ్వరు వరకు తన డైరక్షన్ టాలెంట్ తో అందరిని మెప్పిస్తున్న అనీల్ రావిపుడి ప్రస్తుతం F3 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఎవరితో అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అది తారక్ తోనే అయితే మాత్రం నందమూరి ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news