‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ట్రైలర్ విడుద‌ల‌

193

టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ సీఎం, దివంగ‌త నేత నంద‌మూరి తార‌క రామారావు బ‌యోపిక్ మొద‌టి భాగం.. ఎన్‌టీఆర్ క‌థానాయకుడు గ‌త కొద్ది రోజుల కింద‌టే విడుదలై ఎన్‌టీఆర్ అభిమానుల‌కు వినోదాన్ని పంచింది. ఇక ఎన్‌టీఆర్ బ‌యోపిక్ రెండో భాగం.. ఎన్టీఆర్ మ‌హానాయకుడు కూడా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నెల 22వ తేదీన ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిల‌ర్ ను కొంత సేప‌టి క్రిత‌మే విడుద‌ల చేశారు.

ఎన్‌టీఆర్ బ‌యోపిక్ మొద‌టి భాగంలో ఎన్‌టీఆర్ సినీ జీవితాన్ని తెర‌పై చూపించ‌గా, ఇప్పుడు రెండో భాగంలో ఆయ‌న రాజ‌కీయ జీవితాన్ని తెర‌పై చూపించ‌నున్నారు. అయితే ఓ వైపు సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ట్రైల‌ర్ కూడా ఇప్ప‌టికే విడుద‌లై సంచ‌నాల‌ను సృష్టిస్తోంది. మ‌రి ద‌ర్శ‌కుడు క్రిష్ తీసిన ఎన్‌టీఆర్ మ‌హానాయ‌కుడు ట్రైల‌ర్ కూడా అదే రేంజ్‌లో సంచ‌నాల‌ను రేకెత్తిస్తుందో, లేదో చూడాలి. ఆ విష‌యం మ‌రికొన్ని గంట‌లు ఆగితే తెలుస్తుంది.

ఎన్‌టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమా ఈ నెల 22వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా వ‌ర్మ తీసిన ల‌క్ష్మీస్ ఎన్‌టీఆర్ సినిమా విడుద‌ల తేదీని మాత్రం ఆ చిత్ర యూనిట్ ఇంకా వెల్ల‌డించ‌లేదు. కానీ మ‌హానాయ‌కుడు సినిమాకు పోటీగానే ఆ సినిమాను కూడా విడుద‌ల చేయాల‌ని వ‌ర్మ భావిస్తున్న‌ట్లు తెలిసింది. మ‌రి రెండు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్ష‌కుల‌ను రంజింప‌చేస్తుందో.. వేచి చూస్తే తెలుస్తుంది..!