ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ వస్తుంది..!

-

ఎన్.టి.ఆర్ బయోపిక్ గా నందమూరి బాలకృష్ణ, క్రిష్ చేస్తున్న ప్రయత్నంలో రెండో భాగంగా వస్తున్న సినిమా మహానాయకుడు. మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడు అంచనాలను అందుకోలేదు. అందుకే ఈసారి ఎలాగైనా అభిమానుల అంచనాలను అందుకునేలా వస్తున్నాడు మహానాయకుడు. ఈ సినిమా ఫిబ్రవరి 22న రిలీజ్ కాబోతుంది.

ఎన్.టి.ఆర్ మహానాయకుడు ట్రైలర్ ఈరోజు సాయంత్రం 5 గంటల 55 నిమిషాలకు రిలీజ్ చేస్తారని అఫిషియల్ పోస్టర్ ద్వారా చెప్పారు. ఖాకి దుస్తుల్లో ఎన్.టి.ఆర్ ప్రజలను ఆప్యాయంగా పలుకరిస్తున్న సన్నివేశం పోస్టర్ లో కనిపిస్తుంది. ఓ పక్క ఆర్జివి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంటే ఈరోజు రిలీజ్ కానున్న మహానాయకుడు ట్రైలర్ తో ఎలా ఇంప్రెస్ చేస్తారో చూడాలి.

క్రిష్ వర్సెస్ వర్మ అనడం కన్నా ఎన్.టి.ఆర్ వర్సెస్ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ఈ ఫైట్ లో ఎవరు నెగ్గుతారో చూడాలి. ఫిబ్రవరి 22న మహానాయకుడు వస్తుండగా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ డేట్ ఇంకా ఎనౌన్స్ చేయలేదు.

Read more RELATED
Recommended to you

Latest news