ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ ది సైడ్ క్యారెక్టరే.. వేణు స్వామి సంచలన కామెంట్స్..!

-

ఆర్ ఆర్ ఆర్ సినిమా మీద , అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు చేసిన పాత్రల మీద ఎప్పుడు కూడా చర్చలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఎవరికి ఎక్కువ క్రెడిట్ ఇవ్వాలనే అంశంపై ఎప్పుడు ఎవరూ సరైన సమాధానం చెప్పలేరు. ముఖ్యంగా నందమూరి అభిమానులేమో ఎన్టీఆర్ నటన హైలెట్ అంటే మెగా అభిమానులేమో రాంచరణ్ నటన బాగుంది అని అంటున్నారు.. ఇక సినిమా చూసిన నార్మల్ ఆడియన్స్ లో కొంతమంది రామ్ చరణ్ నటనకు ఫిదా అయితే.. మరి కొంతమంది ఎన్టీఆర్ పర్ఫామెన్స్ కు ఫిదా అవుతున్నారు.

ఇకపోతే రామ్ చరణ్ పోషించిన పాత్రలో చాలా లేయర్స్ వేరియేషన్స్ ఉండడం క్లైమాక్స్ మొత్తంలో రామ్ చరణ్ దూసుకుపోవడం కాస్త ఎన్టీఆర్ పాత్ర తక్కువ అయినట్టు అనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా కొంతమంది ఎన్టీఆర్ను సైడ్ క్యారెక్టర్ అని ట్రోల్ చేస్తుంటారు. హాలీవుడ్ లో ఒక రిపోర్టర్ కూడా ఇలాగే ఎన్టీఆర్ ను సైడ్ క్యారెక్టర్ అని అన్నాడట. ఇదే విషయాన్ని చిట్టిబాబు అనే నిర్మాత ఒక ఛానల్ లో డిబేట్లో పాల్గొని పదేపదే సైడ్ క్యారెక్టర్ అని అన్నాడంటూ నొక్కి మరీ చెప్పాడు. ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది.

ఇదిగో ఇప్పుడు వేణు స్వామి కూడా ఎప్పుడో చెప్పాడు అంటూ ఒక పాత వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఇందులో ఆయన ఎన్టీఆర్ పాత్ర సైడ్ క్యారెక్టర్ అని అన్నాడు. సంక్రాంతి సినిమాలో శ్రీకాంత్ పాత్రలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉంటుందని.. వెంకటేష్ రామ్ చరణ్ అయితే శ్రీకాంత్ ఎన్టీఆర్ అని పోల్చి మరి చెబుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news