టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఊహించని షాక్ తగిలింది. RGV పై టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్..కేసు వేశాడు. ఈ నేపథ్యంలోనే.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు సిటీ సివిల్ కోర్టు షాక్ ఇచ్చింది. తనకు డబ్బులు ఇవ్వకుండా.. రామ్ గోపాల్ వర్మ తప్పించుకుంటున్నాడని కోర్ట్ లో పిటిషన్ వేశారు నిర్మాత నట్టి కుమార్.
తనకు రామ్ గోపాల్ వర్మ… 5 కోట్ల 29 లక్షలు ఇవ్వాలని , ప్రతి సినిమాకు 50 లక్షలు ఇవ్వాలన్న నిబంధనలను తుంగలో తొక్కాడని ఆరోపించారు నట్టి కుమార్. ఈ విషయాన్ని తన ఫిర్యాదు లో పేర్కొన్నారు నట్టి కుమార్. అయితే.. ఈ కేసును విచారించిన సిటీ సివిల్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మ తాజాగా తీసిన మా ఇష్టం సినిమా రిలీజ్ ను ఆపాలని సిటీ సివిల్ కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో మా ఇష్టం సినిమా విడుదలపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. కాగా.. మా ఇష్టం సినిమా రేపు థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది.