బాలయ్య మేనియా.. ఈల వేస్తూ గోల చేసిన బామ్మ

-

సినిమా హీరోలకు అభిమానులు ఉండటం కామన్. కానీ కట్టలు తెంచుకునే అభిమానం ఉండటం.. ఇది మాత్రం కొందరు హీరోలకే దక్కిన వరం. ఆ హీరోల్లో నంబర్ వన్ ప్లేస్ లో ఉంటారు నందమూరి నటసింహం బాలకృష్ణ. సాధారణంగా హీరోలకు వారు ఎంచుకునే సినిమాలు.. వారి స్టైల్.. యాటిట్యూడ్ ని బట్టి రకరకాల ఫ్యాన్స్ ఉంటారు. కానీ బాలకృష్ణకు మాత్రం ఆరేళ్ల బుడ్డోడి నుంచి అరవై ఏళ్ల బామ్మ వరకు ఇలా.. అన్ని వయస్సులో ఉన్న అభిమానులుంటారు.

సాధారణంగా మన ఫేవరెట్ హీరో కనిపిస్తే ఈల వేసి గోల చేయడం పరిపాటే. ఇలా అల్లరి చేసేది ఎక్కువ యువతే. కానీ బాలకృష్ణ అభిమానుల్లో మాత్రం బాలయ్య బాబు కనిపిస్తే పిల్లోడి నుంచి పండు ముసలి వారి వరకు చిందులేస్తారు. ఈల వేసి గోలగోల చేస్తారు. అలా కర్నూల్ లో సినిమా షూటింగ్ కు వెళ్లిన బాలయ్య బాబుని చూసి ఓ బామ్మ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. జై బాలయ్య.. జై జై బాలయ్య అంటూ నేటి యూత్ కి దీటుగా నినాదాలు చేసింది. అంతటితో ఆగకుండా డ్యాన్స్ చేసి ఈల వేసింది.

ఈ బామ్మ గోల కాస్త అక్కడున్న కెమెరామెన్లు తమ కెమెరాల్లో బంధించారు. ఇంకేముంది క్షణాల్లో సోషల్ మీడియాలో ప్రత్యక్షమై ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వాళ్లంతా బామ్మ ఎనర్జీకి ఫిదా అవుతున్నారు. బామ్మ ఏం తింటున్నావ్.. ఈ వయస్సులోనూ ఇంత హుషారుగా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరైతే.. బూస్ట్ ఈజ్ సీక్రైట్ ఆఫ్ బామ్మ ఎనర్జీ అంటున్నారు. ఇప్పటికే ఈ వీడియోకి తెగ లైకులు, షేర్ లు వచ్చేశాయి. మీరూ చూసేయండి.. ఈ బామ్మ చేసిన అల్లరి.

Read more RELATED
Recommended to you

Latest news