హైదరాబాద్ జంట జలాశయాలకు పోటెత్తిన వరద

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిమాయత్‌సాగర్‌కు వరద పోటెత్తింది. ప్రాజెక్టుకు 4 గేట్లు ఎత్తినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. అయితే సోమవారం ఒక గేటు మాత్రమే ఎత్తినట్లు అధికారులు తెలిపారు. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 176.50 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1,769 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 1,200 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,320 క్యూసెక్కులకు చేరింది.

హిమాయత్ సాగర్ ప్రాజెక్ట్
హిమాయత్ సాగర్ ప్రాజెక్ట్

అలాగే ఉస్మాన్ సాగర్‌కు కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్ట్ 6 గేట్లు తెరచినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1,790 అడుగులు. కాగా ప్రస్తుత నీటిమట్టం 1,787 అడుగులకు చేరిందన్నారు. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 2,400 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,442 క్యూసెక్కులకు చేరింది. అలాగే హుస్సేన్ సాగర్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది.