కృష్ణ 11వ రోజు పెద్దకర్మ కార్యక్రమం అక్కడే..!

-

పోయిన ఆదివారం అర్ధరాత్రి సమయంలో సూపర్ స్టార్ కృష్ణ కి గుండెపోటు రావడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు హైదరాబాదులోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే ఒక రోజు తర్వాత ఎంత పరీక్షించినా వైద్యులు ఆయన ప్రాణాన్ని కాపాడలేకపోయారు. ఇందుకు కారణం చికిత్సకు ఆయన శరీరం సహకరించకపోవడం.. నిజానికి ఆయన శరీరంలో ఉన్న ప్రధాన అవయవాలు పనిచేయకపోవడం వల్లే శరీరం చికిత్సకు సహకరించలేదు. దీంతో మంగళవారం తెల్లవారుజామున 4:07 గంటల సమయంలో సూపర్ స్టార్ కృష్ణ స్వర్గస్తులయ్యారు.

కృష్ణ మరణించడం తో టాలీవుడ్ మొదటి జనరేషన్ శకం పూర్తయిందని చెప్పవచ్చు. అయితే సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ ఇండస్ట్రీని జీర్ణించుకోలేకుండా చేస్తోంది. అటు సినీ సెలబ్రిటీలు, ఇటు ప్రేక్షకులు.. మరొకవైపు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆయన మరణానికి ఇప్పటికీ చింతిస్తున్నారు. ఒకే ఏడాది కొడుకు , భార్య మరణించడంతో మానసిక భాదన తట్టుకోలేక ఆయన మరణించాడు అని మరికొంతమంది వార్తలు వైరల్ చేస్తున్నారు. ఏదేమైనా కృష్ణ మరణం సినీ ఇండస్ట్రీకి తీవ్ర దుఃఖాన్ని మిగిల్చిందనే చెప్పాలి.

ఇకపోతే మరణించిన తర్వాత వారికి జరగాల్సిన కార్యక్రమాలపై కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రిందట మూడవ రోజుకు సంబంధించి చిన్న కర్మ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు, సెలబ్రిటీల మధ్య నిర్వహించగా.. ఇప్పుడు ఆయన 11వ రోజు పెద్దకర్మను బుర్రిపాలెం లో చేస్తారంటూ కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలలో నిజం లేదు అంటూ హైదరాబాదులోని కృష్ణ పెద్దకర్మ నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఈరోజు సాయంత్రం హైదరాబాదులోనే ఎక్కడ పెద్దకర్మ చేయబోతున్నారు అనే విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం.నిజానికి హైదరాబాదులోనే పెద్దకర్మ చేయడానికి కారణం కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులను ఇబ్బంది పెట్టకుండా అందరూ హైదరాబాదులోనే ఉన్న నేపథ్యంలో ఇలా కృష్ణ కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news