Home వార్తలు మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్ 2022 ఎవరంటే..?

మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్ 2022 ఎవరంటే..?

‘మోస్ట్‌ పాపులర్‌ మేల్‌ స్టార్‌’ సర్వే టాప్‌ టెన్‌లో కోలీవుడ్ దళపతి విజయ్ నంబర్ వన్ గా నిలిచారు. రెండో స్థానంలో టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, మూడో స్థానంలో యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్, నాలుగో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు. 5- యశ్, 6- అక్షయ్ కుమార్, 7- రామ్ చరణ్, 8- మహేశ్ బాబు, 9- సూర్య, 10- అజిత్ ఉన్నారు.

సినిమాలకు సంబంధించి బాక్సాఫీస్‌ విశ్లేషణలు, రేటింగ్స్‌ ఇచ్చే ఓర్‌మ్యాక్స్‌ సంస్థ చేసిన ‘మోస్ట్‌ పాపులర్‌ మేల్‌ స్టార్‌’ సర్వే టాప్‌ టెన్‌లో తమిళ, తెలుగు నటులు మొదటి పది స్థానాల్లో నిలిచారు. మొదటి పది స్థానాల్లో బాలీవుడ్ నుంచి కేవలం అక్షయ్ కుమార్ మాత్రమే ఉన్నారు. ఆగస్టు 2022 వరకు ఆల్‌ ఇండియా లెవెల్లో తీసుకున్న ఓర్‌మ్యాక్స్‌ సంస్థ గణాంకాలివి.

‘మోస్ట్‌ పాపులర్‌ ఫిమేల్‌ స్టార్స్‌’, ‘మోస్ట్‌ అవైటెడ్‌ తెలుగు ఫిల్మ్స్‌’, ‘మోస్ట్‌ అవైటెడ్‌ హిందీ ఫిల్మ్స్‌’.. ఇలా పలు కేటగిరీల వివరాలను ఓర్‌మ్యాక్స్‌ సోషల్‌ మీడియాలో విడుదల చేసింది.

కథానాయికల జాబితా ఇదీ..  మోస్ట్‌ పాపులర్‌ ఫిమేల్‌ స్టార్స్‌ టాప్‌ 10 జాబితాలో సమంత నంబరు 1గా నిలిచారు. మిగిలిన తొమ్మిది మందిలో అలియా భట్‌, నయనతార, కాజల్‌ అగర్వాల్‌, దీపికా పదుకొణె,  రష్మిక, కీర్తి సురేశ్‌,  కత్రినా కైఫ్‌,  పూజా హెగ్డే, అనుష్క శెట్టి ఉన్నారు.

సినిమాలివీ..

‘మోస్ట్‌ అవైటెడ్‌ తెలుగు ఫిల్మ్స్‌’ జాబితాలో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప-2’ ముందంజలో ఉంది. ఆ తర్వాత, ప్రభాస్‌ హీరోగా రూపొందుతోన్న ‘సలార్‌’, ‘ఆది పురుష్’, పవన్‌ కల్యాణ్‌ ‘హరి హర వీరమల్లు’, విజయ్‌ దేవరకొండ ‘ఖుషి’ చిత్రాలున్నాయి.

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌.. ఇలా ఆయా భాషలకు (ప్రాంతీయంగా) సంబంధించి విడిగా సర్వే చేసింది ఓర్‌మ్యాక్స్‌. అందులో.. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన ‘మోస్ట్‌ పాపులర్‌ మేల్‌ స్టార్‌’ జాబితాలో ప్రభాస్‌ అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌, మహేశ్‌బాబు, పవన్‌ కల్యాణ్‌, నాని, విజయ్‌ దేవరకొండ, చిరంజీవి, రవితేజ ఉన్నారు.