” భళా తందనాన” మూవీ ఓటిటి విడుదల తేదీ ఖరారు

-

ప్రస్తుతం సినీ ప్రేమికులు ఓటిటిలకు ఏ రేంజ్ లో అలవాటు పడిపోయారో మనందరికీ తెలిసిందే. కరోనా సమయంలో కొన్ని రోజులపాటు థియేటర్లను పూర్తిగా మూసేయడంతో సినీ ప్రేమికులు చాలా మంది ఓటిటిలకు అలవాటు పడిపోయారు.అయితే కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా శ్రీ విష్ణు నటించిన సినిమా ‘భళా తందనాన ‘ కూడా అతి తక్కువ రోజుల్లోనే ఒటీటిలోకి రాబోతోంది.

తాజాగా ఇందుకు సంబంధించిన ప్రకటన కూడా వెలువడింది. శ్రీ విష్ణు హీరోగా కేతరిన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకు చైతన్య దంతులూరి దర్శకత్వం వహించగా రజినీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు. మే 6 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ ను సంపాదించుకుంది. అయితే నెల రోజులు కూడా తిరగకుండానే ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. భళా తందనానా సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈనెల 20వ తేదీ నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటి సంస్థ అధికారికంగా ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news