హరీశ్ తీరుతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో.!

-

దర్శకుడు హరీశ్ శంకర్ తో పవన్ కళ్యాణ్ సినిమా ఒకే అయ్యి ఉస్తాద్ భగత్ సింగ్ గా వస్తున్న సంగతి తెలిసిందే.అయితే హరీశ్ శంకర్ ముందు అనుకున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ వదిలి, తమిళ సినిమా అయిన తెరి ను రీమేక్ కోసం మార్చి స్క్రిప్ట్ రెడీ చేయమని పవన్ కళ్యాణ్ చెప్పి నట్లు గా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కోసం టైమ్ తీసుకొని హరీశ్ వర్క్ చేస్తున్నాడట.

దీనిపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారట . రీమేక్ అని భీమ్లా నాయక్ తీస్తే హిట్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ అందుకోలేక పోయింది. గతంలో సొంతంగా రాసిన కథ తో తీసిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఇక మళ్లీ రీమేక్ అని టీవీ లో ఎన్నో సార్లు అరిగిపోయిన రికార్డు లా వేసిన తేరి ని తీస్తే ఎలా అని గోల చేసినా కూడా ఈ ప్రోజెక్ట్ ఆగే అవకాశం లేదని తెలుస్తోంది. అలా కాకుండా ఉండేందుకు హరీశ్ శంకర్ కథలో చాలా మార్పులు చేర్పులు చేస్తున్నాడట.

ఇది ఇలా ఉండగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హారి హర వీరమల్లు సినిమా షూటింగ్ కూడా చాలా పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు ఇంకో షాకింగ్ న్యూస్ హల్చల్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమా లేట్ అవుతున్న క్రమంలో  గతంలో దిల్ రాజు కు హరీష్ ఒక కథ చెప్పారట. అది ఇప్పుడు లైన్ లోకి వచ్చింది అని అంటున్నారు. ఆ మూవీ హరీష్ శంకర్ డైరెక్షన్ లో తమిళ హీరో శివకార్తికేయన్ తో దిల్ రాజు కమిట్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు అన్నీ విని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసహనం తో తలపట్టు కుంటుంటున్నారట.

 

Read more RELATED
Recommended to you

Latest news