పవన్ కళ్యాణ్ సినిమా హరి హర వీరమల్లు’ షూటింగ్ చివరి షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇంకొన్ని రోజులలో షూటింగ్ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది. రీసెంట్ గా బాలివుడ్ నటుడు బాబీ డియోల్ కూడా షూటింగ్ కు హాజరు అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం బహుబలి రేంజ్ లో యుద్ద సన్నివేశాలు తీస్తున్నారట. దానికోసం అనేక రథాలు, గుర్రాలు, ఏనుగులు వినియోగిస్తున్నారట.
మరో పక్క హరీశ్ శంకర్ ముందు అనుకున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ వదిలి, తమిళ సినిమా అయిన తెరి ను రీమేక్ కోసం స్క్రిప్ట్ రెడీ చేయమని పవన్ కళ్యాణ్ చెప్పి నట్లు గా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ చేతిలో సుజిత్ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం కూడా ఉంది. కాని పవన్ నుంచి వెంటనే సినిమా రావడం లేదు. పవన్ ఫ్యాన్స్ మాత్రం పాత సినిమాలు మళ్లీ రిలీజ్ అయినా వాటినే హిట్ చేస్తూ ఆనంద పడుతున్నారు.
ఇక ఫ్యాన్స్ కు హుషారు వచ్చే న్యూస్ ఒకటి బయటకి వచ్చింది.పవర్ – క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా టీజర్ ని ఈ నెల 26 న రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేయనున్నారుట. అలాగే సినిమా ను తొందరగా పూర్తి చేసి ఈ వేసవి కాలంలో రిలీజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి.