ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారింది – చెరుకు సుధాకర్

-

సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పీసీసీ ప్రధాన కార్యదర్శి చెరుకు సుధాకర్. గోల్ మాల్ గోవిందం ఎక్కడో లేడు.. కెసిఆరే గోల్ మాల్ గోవిందం అని దుయ్యబట్టారు. రైతు స్వరాజ్య వేదిక నివేదిక ఇస్తే.. మీ ఎమ్మెల్సీ ఉరికించి కొడతా అన్నారని గుర్తు చేశారు. అది రైతుల మీద మీకున్న చిత్తశుద్ధి అని మండిపడ్డారు. మునుగోడులో 30 వేల మంది యాదవుల అకౌంట్ లో డబ్బులు వేసి ఫ్రీజ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

కేసీఆర్ కి విజన్ ఉంటే.. ఇన్ని అప్పులు తెచ్చే వాడా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలాలు అమ్మింది.. అమ్ముతున్నది కేసీఆర్ అని ఆరోపించారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారిందన్నారు చెరుకు సుధాకర్. బిఆర్ఎస్ పార్టీ అమిత్ షా కి హాట్ లైన్ లో ఉండి పని చేస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమకారులు బిఆర్ఎస్ కుట్రలను ఛేదించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news