ఎఫ్-2లో పవన్ కళ్యాణ్.. దిల్ రాజు లీక్ చేశాడు..!

-

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఎఫ్-2. అనీల్ రావిపుడి డైరక్షన్ లో దిల్ రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ వేడుక ఆదివారం సాయంత్రం వైజాగ్ లో జరిగింది. ఈవెంట్ లో భాగంగా వెంకటేష్ తనకు వైజాగ్ తో ఉన్న అనుబంధం గురించి చెప్పారు. వెంకటేష్ స్వర్ణ కమలం, సుందరాకాండ, మళ్లీశ్వరి సినిమాలు విజాగ్ లోనే షూటింగ్ జరుపుకున్నాయి.

మెగా వేడుక ఏదైనా పవన్ నామస్మరణ లేనిదే ఫ్యాన్స్ ఊరుకుంటారా.. అలానే ఎఫ్-2 వేడుకల్లో పవర్ స్టార్ కేకలు వినిపించాయి. అయితే వారి ఉత్సాహాన్ని పెంచేందుకు దిల్ రాజు సినిమాలో ఓ పాటకి వరుణ్ తేజ్ లుంగీ కట్టారని అప్పుడు పవన్ ను ఇమిటేట్ చేశాడని.. వరుణ్ అలా చేస్తే అచ్చం పవన్ లానే అనిపించారని అన్నాడు దిల్ రాజు.

వెంకటేష్ కూలీ నంబర్ 1 సినిమాలో లా కనబడగా వరుణ్ తేజ్ మాత్రం తమ్ముడు సినిమాలో వయ్యారి భామ నీ హంస నడక పాటలో పవన్ లా కనబడతాడట. మొత్తానికి ఈ విషయాన్ని చెప్పి మెగా ఫ్యాన్స్ ను అలరించారు దిల్ రాజు.

Read more RELATED
Recommended to you

Latest news