ప‌వ‌న్‌క‌ల్యాణ్ `పింక్‌` సినిమాకు హీరోయిన్ ఫిక్స్‌..

-

‘అజ్ఞాతవాసి’ తర్వాత జనసేన పార్టీ, రాజకీయాలతో బిజీ అయ్యారు పవన్‌కల్యాణ్‌. ఇక ఆయన సినిమాల్లో నటిస్తారా? లేదా? అనే సందేహంలో ఉన్న అభిమానులకు ఓ స్పష్టత వచ్చింది. ఈ క్ర‌మంలోనే ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తూ.. బాలీవుడ్‌లో విజ‌యవంత‌మైన `పింక్‌` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. దిల్‌రాజు, బోనీక‌పూర్ నిర్మాత‌లుగా వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొంద‌నుంది. సినిమా సెట్స్ పైకి వెళ్లే లోపు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసుకోవాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారు.

అందులో భాగంగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ట‌. సోష‌ల్ మీడియా వార్త‌ల ప్ర‌కారం ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న హీరోయిన్ పాత్ర‌లో న‌య‌న‌తార‌ను న‌టింప చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. పాత్ర నిడివి త‌క్కువ‌గానే ఉండ‌టంతో పాటు ప‌వ‌న్‌, న‌య‌న జోడి ఫ్రెష్ లుక్ తెస్తుంద‌ని భావిస్తున్నార‌ట‌. మ‌రి దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news