Akira Nandan : ‘లిటిల్ పవర్‌‌స్టార్’ ఎంట్రీ ఫిక్స్.. తొలిసారి స్కీన్ షేర్ ఎవ‌రితో తెలిస్తే షాక్!

-

Akira Nandan : పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్ ప్లాప్‌ల‌తో సంబంధం లేకుండా స్టార్ డాం సాధించిన ఏకైక హీరో. ఆయ‌నకు సామాన్య ప్రేక్ష‌కులే కాదు.. సినీ సెలబ్రెటీల్లో కూడా డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారంటే.. అతిశ‌యోక్తి కాదు. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత సినిమాల్లో గ్యాప్ తీసుకుని ఇటీవలే వకీల్ సాబ్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక వరస సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీ అయ్యాడు. అయితే పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా ఫస్ట్ నుండీ అకీరా మీద మెగాభిమానులు స్పెష‌ల్ ఫోకస్ పెడుతున్నారు. ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్లో క‌నిపించినా.. మీడియా కూడా అతనే హైలెట్ అవుతుంటాడు.

ఈ నేప‌థ్యంలో లిటిల్ పవర్ స్టార్ త్వరలోనే టాలీవుడ్ లోని ఏంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌నే వార్తలు నెట్టింట
తెగ వైర‌ల్ అవుతున్నాయి. అది కూడా త‌న తండ్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో సినీ రంగ ప్ర‌వేశం చేయ‌బోతుండ‌టం మ‌రో ప్ర‌త్యేక‌త‌. అది కూడా క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తోన్న హిస్టారికల్ ఫిలిం ‘హరి హర వీర మల్లు’లో అకిరా గ్రాండ్ ఏంట్రీ ఇవ్వ‌నున్న‌డ‌ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇప్పటికే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ త‌రుణంలో ఈ సినిమాలో ఓ స్పెష‌ల్ రోల్ లో అకీరాను ఇంట్ర‌డ్యూస్ చేస్తే బాగుంటుంద‌ని క్రిష్ రిక్వెస్ట్ చేయ‌డంతో ప‌వ‌న్ క‌ళ్యాన్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. అందుకే అకీరా గతకొద్ది రోజులుగా మార్షల్ ఆర్ట్స్, కర్రసాము వంటివి నేర్చుకుంటున్న‌డ‌ట‌.

అకిరా నటించేది ఓ చిన్న పాత్ర.. అయినప్పటికీ పవన్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. అకీరా తండ్రికి తగ్గ కొడుకులా కరాటే, కుంగ్ ఫు వంటి మార్షల్ ఆర్ట్స్ లో ప్ర‌త్యేక శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం తనకంటే పెద్దవారికి కూడా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇస్తున్న సంగతి తెలిసిందే.

https://www.instagram.com/reel/CSEupmYiBDD/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news