కేజీఎఫ్ నిర్మాతలు హాంబేలే ఫిలింస్ పతాకంపై పాన్ ఇండియా రేంజిలో సినిమా మొదలవబోతుందని ప్రకటన వచ్చినప్పటి నుండి ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో సందడి స్టార్ట్ చేసారు. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఈ సినిమా ఉండనుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ మొదటి సినిమా అయిన ఉగ్రం ని పాన్ ఇండియా వైడ్ గా రూపొందించాలన్న ప్లాన్ లో ఉన్నారట. గ్యాంగ్ స్టర్ల నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రభాస్ కి బాగా సూటవుతుందట.
ఐతే ప్రభాస్ చేతిలో ఇప్పటికే మూడు సినిమాలున్నాయి. అవన్నీ పూర్తి కావడానికే మూడేళ్ళ సమయం పట్టేలా ఉంది. మరి ప్రశాంత్ నీల్ తో సినిమా భారీ స్థాయిలో ఉంటుంది కాబట్టి మరో రెండేళ్ళ సమయం పట్టవచ్చు. అంటే ఐదేళ్ళ దాకా ప్రభాస్ బిజీ అయిపోతాడన్నమాట. ఐతే ప్రభాస్ అభిమానులు అనుకుంటున్నట్టు ఈ అప్డేట్ అదేనా కాదా అన్నది చూడాలి. మరో కొద్ది గంటల్లో ఏ విషయం తేలిపోతుంది.