‘వకీల్‌ సాబ్‌’ పవన్ ప్రీ రిలీజ్ బిజినెస్ 150 కోట్లు…?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరాం దర్శకత్వంలో పింక్ రీమేక్ సినిమాను ఆయన చేస్తున్నారు. ఈ సినిమా టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పవన్ కళ్యాణ్ సినిమా అనగానే సాధారణంగా ఒక క్రేజ్ ఉంటుంది. ఈ సినిమాకు కాస్త ఎక్కువగా ఉంది. సినిమాలు చేయను అని చెప్పిన ఆయన ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నారు.

దీనితో ఈ సినిమా ప్రిరిలీజ్ వ్యాపారం భారీగా జరిగే అవకాశం ఉందని అంటున్నారు. సినిమా శాటిలైట్ హక్కులు, పాటలు ఇలా ప్రతీ ఒక్కటి కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. దీనితో వాటి కొనుగోలుకి ప్రముఖ సంస్థలు పోటీ పడే అవకాశం ఉంది. దీనితో భారీ పోటీ ఉంటుంది మార్కెట్ లో ఉంటున్నారు. ఇక ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ లేదా హాట్ స్టార్ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఈ రెండు భారీ సంస్థలే కాబట్టి భారీ మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంది. నాన్ బాహుబలి రికార్డులను ఈ సినిమా అధిగమించే అవకాశం ఉందని టాలీవుడ్ లో చర్చ జరుగుతుంది. ఇక ఈ సినిమా వసూళ్ళ విషయానికి వస్తే టాలీవుడ్ లో మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకునే అవకాశాలు ఉన్నాయి అనే ప్రచారం జరుగుతుంది. ఏది ఎలా ఉన్నా ఈ సినిమా మాత్రం నాన్ బాహుబలి రికార్డులను తిరగరాయడం ఖాయమని అంటున్నారు.