#PSPK28 : జాతర మొదలు పెట్టిన పవన్… గత్తర లేపిన ప్రీ లుక్

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు రాజకీయం, ఇటు సినిమా… రెండు దారులు లోనూ దూసుకుపోతున్నారు. ఇటీవలె వకీల్ సాబ్ సినిమాతో గ్రాండ్ ఎంట్రీ పిచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు సినిమాల తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకు రానున్నారు.

గతంలో గబ్బర్ సింగ్ సినిమాతో భారీ హిట్ సాధించిన ఈ కాంబో మరో భారీ మూవీ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా… మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో తెరకెక్కనుంది. ఈ సినిమా దేశభక్తి కథాంశంగా తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తుంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేపథ్యంలో ఈ సినిమా నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సినిమా నుంచి ప్రీ లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ ప్రీ లుక్ లో … పవన్ కళ్యాణ్ ఓ బైక్ పైన కూర్చొని… స్టైలిష్ లుక్ లో కనిపించారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖం మాత్రం కనిపించకుండా ఈ పోస్టర్ ను వదిలారు.  ఇకా ఈ తాజా అప్డేట్ తో ఈ మూవీపై భారీగా అంచనాలు పెరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news