ఇస్మార్ట్ శంకర్ కు అంత సీన్ ఉందా..!

5

పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. పూరి, ఛార్మి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుంది. మే లో రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ భారీ రేటు చెబుతున్నారట. కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులు తీస్తున్న పూరి కసితో చేస్తున్న సినిమా ఇస్మార్ట్ శంకర్. సినిమా పోస్టర్స్ ఇప్పటికే అంచనాలు పెంచాయి.

ఈమధ్య ఓ రెండు ఛానెల్స్ ఇస్మార్ట్ శంకర్ శాటిలైట్ డీల్ కోసం అడుగగా పూరి ఏకంగా 10 కోట్ల దాకా చెబుతున్నాడట. మరి శాటిలైట్ రైట్సే ఈ రేంజ్ లో చెబితే డిగిటల్, డబ్బింగ్ రైట్స్ ఎలా చెబుతారో. సినిమా రిలీజ్ కు ముందే ఇలా ఉంటే ఒకవేళ అనుకున్న విధంగా సినిమా ఫలితం వస్తే మళ్లీ పూరి ఫాంలోకి వచ్చేసినట్టే. మరి రాం, పూరి అనుకున్న విధంగా ఇస్మార్ట్ శంకర్ హిట్ కొడుతుందా లేదా చూడాలి.

amazon ad