లాహోర్ నుంచి రోడ్డు మార్గంలో పాక్ అధికారులు వాఘాకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో అభినందన్‌కు వైద్య పరీక్షలు చేశారు. ఆ తరువాత అభినందన్‌ను పాక్ భారత్‌కు అప్పగించింది.
పాకిస్థాన్ ఆర్మీ అదుపులో ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ ను ఎట్టకేలకు విడిచిపెట్టారు. అభినందన్‌ను ఇవాళ భారత్‌కు అప్పగిస్తామన్న పాక్ ప్రధాని అన్న మాట ప్రకారం అతన్ని విడుదల చేశారు. అభినందన్‌ను గత కొంత సేపటి కిందటే వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు పాక్ అప్పగించింది. ఈ క్రమంలో అభినందన్‌కు స్వాగతం పలికేందుకు అటు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సైనికులతోపాటు స్నేహితులు, బంధువులు, పెద్ద సంఖ్యలో ప్రజలు వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. అభినందన్‌ను పాక్ భారత్‌కు అప్పగించగానే భారత వాయుసేన అతనికి ఘన స్వాగతం పలికింది.
కాగా అంతకు ముందు అభినందన్‌ను లాహోర్ నుంచి రోడ్డు మార్గంలో పాక్ అధికారులు వాఘాకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో అభినందన్‌కు వైద్య పరీక్షలు చేశారు. ఆ తరువాత అభినందన్‌ను పాక్ భారత్‌కు అప్పగించింది. అయితే భారత్‌కు క్షేమంగా చేరుకున్న అభినందన్‌కు ఢిల్లీలో పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేయనున్నారు. ఈ క్రమంలోనే అభినందన్‌కు మరికొన్ని పరీక్షలు నిర్వహించి ఆ తరువాత ఇంటికి పంపేస్తారని తెలిసింది.
పాక్ ఆర్మీ అదుపులో ఉన్నప్పటికీ ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శించినందుకు అభినందన్‌కు ఇప్పుడు యావత్ భారత ప్రజలు శాల్యూట్ చేస్తున్నారు. అతని ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. పాక్ ఆర్మీ అభినందన్‌కు అనేక ప్రశ్నలు వేసి భారత్‌కు చెందిన మిలటరీ సమాచారాన్ని అతని నుంచి సేకరించాలని యత్నించింది. అయినప్పటికీ అభినందన్ ఆ సమాచారం చెప్పడానికి నిరాకరించాడు. ఆ ప్రశ్నల తాలూకు వీడియోలు కూడా ఇప్పటికే విడుదల కాగా, అందరూ అభినందన్ దేశ భక్తిని కొనియాడుతున్నారు. ఏది ఏమైనా పాక్ ఆర్మీ చెర నుంచి యోధుడిగా బయటకు వచ్చిన అభినందన్‌కు మనమందరం శాల్యూట్ చేయాల్సిందే..!