పుష్ప 2: సుకుమార్ పారితోషకం అన్ని రూ. కోట్లా..?

-

సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప 2 సినిమా లెక్కలు మారుతున్నాయి. ఇప్పటికే పుష్ప ది రైజ్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమా ఏకంగా బాక్సాఫీస్ వద్ద రూ. 350 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. నిజానికి బాలీవుడ్ లో ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఇక ఉత్తరాదిన ఈ సినిమా ఇంత రేంజ్ లో సక్సెస్ అవుతుందని సుకుమార్ కూడా గెస్ చేయలేదు. దీంతో ఒక్కసారిగా తన రేంజ్ కూడా మారిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం పుష్ప సినిమాతో రాజమౌళి, ప్రశాంత్ నీల్ సరసన నిలిచారు సుకుమార్. ఈ ముగ్గురు డైరెక్టర్లు కూడా ఇండియాలోనే ఫేమస్ డైరెక్టర్లుగా మారిపోవడం గమనార్హం.

LATEST POSITION | 22 January, 2022 'PUSHPA' MANAGES TO SCORE DESPITE OTT RELEASE – Film Information

నిజానికి రాజమౌళి ,ప్రశాంత్ నీల్ ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు అంటే ఆ సినిమాలో పారితోషకం తో పాటు వాటా కూడా తీసుకుంటున్నారు. ఇక తమ ప్రతిభనే సినిమాలో పెట్టుబడిగా చూపించి షేర్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ జాబితాలోకి సుకుమార్ కూడా చేరిపోయాడు. పుష్ప 2 కోసం సుకుమార్ ఇంతవరకు మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఒక రూపాయి కూడా పారితోషకంగా తీసుకోలేదట. విజయం సాధించిన తర్వాత వచ్చే లాభాలలో వాటా తీసుకోవాలని , పారితోషకం విషయంలో సైలెంట్ గా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక పుష్ప ది రైజ్ సినిమా విడుదలకు ముందు సుకుమార్ రూ.20 కోట్లు పారితోషకం తీసుకున్నారు.

థియేటర్లో రూ.150 కోట్లకు అమ్ముడైన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లు షేర్ తీసుకొచ్చి పెట్టింది. ఇక దాదాపుగా రూ.300 కోట్లకు పైగా లాభాలను వచ్చినట్లు సమాచారం. ఇక మొదటి భాగానికి రూ.50 కోట్ల పారితోషకం తీసుకున్న అల్లు అర్జున్.. రెండవ భాగానికి రూ.110 కోట్లకు పైగా తీసుకున్నట్లు వార్తల వైరల్ అవుతున్నాయి. ఇక దీంతో పుష్ప కోసం సుకుమార్ సులభంగా రూ.70 కోట్ల పారితోషకం డిమాండ్ చేసే అవకాశం ఉందని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఆయన పారితోషకం తీసుకుంటారా? లేదా? లాభాల్లో వాటాలు తీసుకుంటారా? అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news