కెరీర్ ప్రారంభం నుండి విభిన్నమైన పాత్రలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న శ్వేతా నందిత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రాఘవ రెడ్డి’. చాలా కాలం తర్వాత సీనియర్ హీరోయిన్ రాశి కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. శివ కంఠమనేని, అజయ్, పోసాని కృష్ణ మురళి, అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి మరియు శ్రీనివాసులు రెడ్డి తదితరులు ఈ చిత్రం లో నటించారు. నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాం.
కథ :
లక్కీ అలియాస్ మహాలక్ష్మి (నందిత శ్వేతా ) మహా అల్లరి పిల్ల..జీవితం లో ప్రతీ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తూ బ్రతకాలని అనుకుంటుంది. తెలంగాణ కి చెందిన ఈ అమ్మాయిని వైజాగ్ లో పై చదువు కోసం జాయిన్ చేస్తుంది ఆమె తల్లి దేవకీ (రాశీ). లక్కీ చదువుతున్న కాలేజీ లో రాఘవ రెడ్డి (శివ కంఠమనేని) క్రిమినాలజీ ప్రొఫెసర్ గా పని చేస్తూ ఉంటాడు. లక్కీ కాలేజీ లో చేసే అల్లరి పనుల వల్ల రాఘవ రెడ్డి ఆమెకి స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఇస్తూ ఉంటాడు. వీళ్లిద్దరి మధ్య పలు సందర్భాలలో పెద్ద ఎత్తున గొడవలు కూడా జరుగుతాయి. అయితే ఒక రోజు లక్కీ ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. తన కూతురు ఎక్కడా అని రాఘవ రెడ్డి ని నిలదీస్తుంది దేవకీ. ఆ తర్వాత రాఘవరెడ్డి తన క్రిమినల్ బ్రెయిన్ ని వాడి, పోలీసులతో కలిసి లక్కీ ఆచూకీ ని ఎలా కనిపెట్టాడు. అసలు లక్కీ, దేవకీ మరియు రాఘవరెడ్డి కి ఉన్న సంబంధం ఏమిటి?, లక్కీ ఎవరు ఇందుకోసం కిడ్నాప్ చేసారు అనేది మిగిలిన స్టోరీ.
విశ్లేషణ:
ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ చిత్రం గా ఈ ‘రాఘవ రెడ్డి’ సినిమాని తీర్చి దిద్దాడు డైరెక్టర్ సంజీవ్ మేగోటి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో ఉండే లవ్ స్టోరీలు లాంటివి ఈ సినిమా లో ఉండవ్. ఒక డిఫరెంట్ కథ, కథనం తో కమర్షియల్ పద్దతిలో చాలా చక్కగా తెరకెక్కించాడు డైరెక్టర్. సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో పాటు, సెంటిమెంట్ సన్నివేశాలు కూడా బాగా పండాయి. శివ కంఠమనేని ఫైట్స్ విషయం లో కానీ,పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పడం లో కానీ శబాష్ అని అనుకున్నాడు. ఇక చాలా కాలం తర్వాత హీరోయిన్ రాశి ఈ చిత్రం లో కనిపించింది. చాలా సెటిల్ గా, అవసరామైనప్పుడు ఎమోషనల్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించింది. ఇకపోతే శ్వేతా నందిత ఈ చిత్రం లో బబ్లీ గర్ల్ గా నటించింది. ఇది వరకు ఆమె ఇలాంటి పాత్రలో నటించలేదు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా కమర్షియల్ మూవీ లవర్స్ కి బాగా నచ్చుతుంది. ఆన్ స్క్రీన్ మీద పాటలు కూడా బాగా కుదిరాయి.
చివరి మాట :
ఈమధ్య కాలం లో వచ్చిన రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పోలిస్తే రాఘవరెడ్డి చిత్రం వెయ్యి రెట్లు బెటర్. కాబట్టి ఈ వీకెండ్ కి ఏ సినిమా చూడాలా అని అనుకుంటున్న ఆడియన్స్ వెంటనే ఈ చిత్రాన్ని చూసేయండి.