రాజమౌళి దర్శకత్వంతో సూపర్ ఛాన్స్ మిస్…. ఆ స్టార్ డైరెక్టర్ కొడుకు రేంజ్ వేరేలా ఉండేది

-

గతంలో ఓ సినిమాకు వెళ్లాలంటే హీరో ఎవరు, హీరోయిన్ ఎవరని ఆరా తీసేవారు…కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి… డైరెక్టర్ ఎవరంటూ అడుగుతున్నారు. అంతలా సినిమాపై ముద్ర వేస్తున్నారు పలువురు డైరెక్టర్లు.

ముఖ్యంగా డైరెక్టర్ల ప్రస్తావన వస్తే ముందు వరసలో ఉంటారు దర్శకధీరుడు రాజమౌళి. తను డైరెక్ట్ చేసిన సినిమాలన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్లు రాబట్టాయి. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి మొదలు పెడితే… సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు, మర్యాదరామన్న, బాహుబలి1,2 భారీ విజయాలను నమోదు చేశాయి. ప్రస్తుతం ‘ ఆర్ఆర్ఆర్’ ఈనెల 25న విడుదల కాబోతోంది.

బాహుబలి1 ,2 తెలుగు సినిమా రికార్డులనే కాకుండా బాలీవుడ్ రికార్డులను కూడా తారుమారు చేసింది. ఏకంగా వేల కోట్లను కొల్లగొట్టింది. ఒకప్పడు సౌత్ లో భారీ సినిమాలు అంటే వెంటనే గుర్తుకువచ్చే పేరు శంకర్. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది ఇప్పుడు రాజమౌళినే సౌత్ నెంబర్ వన్ డైరెక్టర్. 

ఇలాంటి దర్శకుడితో  ఒక్క సినిమా అయినా చేయాలని అందరు హీరోలకు ఉంటుంది. అయితే కెరీర్ ప్రారంభంలో మాత్రం రాజమౌళి ప్రారంభించిన ఓ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. స్టూడెంట్ నెంబర్ 1 తరువాత రాజమౌళి.. మోహన్ లాల్ తో ఓ మైథలాజికల్ డ్రామాను ప్లాన్ చేశాడు. అయితే ఆసినిమా పట్టాలు ఎక్కలేదు. ఆ తరువాత స్టార్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు తనయుడు సూర్య ప్రకాష్ తో ఓ భారీ సినిమాను ప్లాన్ చేశాడు. అయితే బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఒక వేళ రాజమౌళి దర్శకత్వంలో ఈసినిమా పూర్తయితే సూర్య ప్రకాష్ కెరీరే వేరే లెవల్ లో ఉండేది.

Read more RELATED
Recommended to you

Exit mobile version