కిలికి కాదు కొత్త భాష తెస్తున్న రాజమౌళి

-

బాహుబలిలో కిలికి భాష గుర్తుంది కదా ఆ సినిమా సూపర్ లో భాగంగా కాలకేయ ప్రభాకర్ మాట్లాడే కిలికి భాష కూడా సూపర్ సెన్సేషన్ అయ్యింది. ఆ భాషకు మూల కారణం రాజమౌళి సలహా మేరకు తమిళ రచయిత కార్కి అని తెలిసిందే. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఎన్.టి.ఆర్, రాం చరణ్ మూవీ ఆర్.ఆర్.ఆర్ కోసం కూడా కొత్త భాష ప్రయోగం చేస్తున్నాడట జక్కన్న.

ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ నెగటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలో నటిస్తాడట. అందుకే అతనికో కొత్త రూపంతో పాటుగా కొత్త భాషని సిద్ధం చేస్తున్నారట. ప్రస్తుతం కార్కి, రైటర్ సాయి మాధవ్ అదే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తుంది. కిలికి భాషే కొత్తగా అనిపిస్తే ఈసారి హీరోకి వాడే ఈ కొత్త భాష ఎలా ఉంటుందో అని అంచనాలు పెంచుతున్నారు.

డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ గా రామ రావణ రాజ్యం అని పెట్టబోతున్నారట. 2020 సమ్మర్ కల్లా రిలీజ్ పాన్ చేస్తున్న ఈ సినిమా 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news