రామం, రాఘవం ఫస్ట్ లుక్ విడుదల..!

-

ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో.. కమెడియన్ ధనరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. స్లెట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ అరిపాక సమర్పణలో  పృథ్వి పొలవరపు నిర్మాణంలో ప్రొడక్షన్ నెంబర్ వన్ గా తెరకెక్కుతున్న ద్విభాష చిత్రానికి రామం రాఘవం అనే టైటిల్ ను ఖరారు చేసారు. జనవరి 22న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా రామం రాఘవం ఫస్ట్ లుక్ ను 22 మంది సినీ ప్రముఖుల చేతుల మీదుగా విడుదల చేసారు. 

నటుడు ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సముద్ర ఖనితో పాటు అతడు కూడా నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో తండ్రి కొడుకులుగా సముద్ర ఖని, ధనరాజ్ కనిపిస్తున్నారు. ఇంటెన్స్ తో కూడిన పోస్టర్ కు విశేష స్పందన లభిస్తోంది. ఇదివరకు ఎప్పుడూ చూడని ఒక తండ్రి కొడుకుల కథను అద్భుతంగా తెరమీద ఆవిష్కరిస్తున్నామని దర్శకుడు ధన్ రాజ్ తెలిపారు. ఈ మూవీలో మోక్స, హరీశ్ ఉత్తమన్, సత్య  పృద్వి, శ్రీనివాస రెడ్డి చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు తదితరులు నటిస్తున్నారు. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version