రామ్​చరణ్​కు హాలీవుడ్ ఎంట్రీ​.. ‘జేమ్స్​బాండ్’​గా ఛాన్స్​!

-

‘జేమ్స్ బాండ్’.. పిల్లాడి నుంచి ముసలి వాళ్ల వరకు ఈ పేరు తెలియని వారుండరు. ప్రపంచ వ్యాప్తంగా బాండ్ మూవీలకు ఉండే క్రేజ్ అలాంటిది మరి. ఈ సిరీస్ లో ఇప్పటికి 25 సినిమాలు వచ్చాయి. చివరిగా ‘నో టైమ్ టు డై’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పటిలాగే ‘జేమ్స్ బాండ్ ఈజ్ సూపర్ హిట్ ఎవర్’ అన్నట్లు మంచి టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా గత ఐదు సిరీస్ లలో ‘జేమ్స్ బాండ్’ గా నటించిన డేనియల్ క్రెగ్ ఈ ఫ్రాంచైజీకి గుడ్ బై చెప్పేశాడు.

ఇక అప్పట్నుంచి తదుపరి బాండ్ ఎవరనే ప్రశ్న చాలా మంది మెదడులో తిరుగుతోంది. అయితే ఈ పాత్రలో ఎవరైతే బాగుంటారని ఆలోచించిన ప్రముఖ మార్వెల్ రైటర్ చియో హోదారి కోకర్.. ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. తన దృష్టిలో ‘జేమ్స్ బాండ్’ పాత్రను బాగా పోషించే ఐదుగురి పేర్లను ట్వీట్ చేశారు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. అందులో టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పేరుండటం. ఈ ట్వీట్ చూసిన రామ్ చరణ్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. త్వరలోనే తమ అభిమాన హీరో వరల్డ్స్ ది బెస్ట్ సూపర్ హీరో పాత్ర అయిన ‘జేమ్స్ బాండ్’ పాత్రలో కనిపించే అవకాశముందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆయన ట్వీట్ చేసిన పేర్లు ఎవరెవరివంటే.. ఇడ్రిస్​ ఎల్బా, మ్యాథ్యూ గూడె, డామ్సన్​ ఇద్రిస్​, సోప్​ దిరిసు, రామ్ చరణ్.

కాగా, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్​ఆర్​ఆర్’​తో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్​ సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యాక.. హాలీవుడ్​ ప్రేక్షకుల,దర్శకులు జక్కన్న టేకింగ్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. అంతేకాదు చరణ్, తారక్​ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘లుక్​కేజ్’ సృష్టికర్త చియో హోదారి కోకర్ కూడా ‘ఆర్​ఆర్​ఆర్’​ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. అలానే చరణ్​ను ఉద్దేశిస్తూ తాజా ట్వీట్​ చేశారు.

ఇక చరణ్​ సినిమాల విషయాన్నికొస్తే.. ఆయన ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఆర్​సీ 15’ చేస్తున్నారు. పవర్‌ఫుల్‌ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ ప్రాజెక్ట్‌ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దీనిపై ఫ్యాన్స్​లో భారీ అంచనాలు ఉన్నాయి. చరణ్‌ మూడు భిన్న గెటప్​లలో కనిపించనున్నారని సమాచారం. అందులో ఒకటి ఐఏఎస్‌ అధికారిగా కనిపించనున్నారట. కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీకాంత్‌, అంజలి కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news