ఈ క్యూట్ కుర్రాళ్లను మీరు గుర్తుపట్టారా..వీళ్లిప్పుడు స్టార్ హీరోలు తెలుసా?

-

ప్రతీ ఒక్కరి జీవితంలో చిన్న ‘నాటి’ విషయాలు చాలా ముఖ్యంగా ఉంటాయి. ఆ ‘నాటి’ సంగతులు గుర్తు చేసుకుంటే చాలు..మనసు ఎంతో హాయిగా, ఆనందంగా మారిపోతుంటుంది. అలా అప్పటి విషయాలను ఆ నాటి ఏదేని ఒక ఫొటో చూసినా అప్పుడప్పు గుర్తుకొస్తుంటాయి. అలా టాలీవుడ్ యంగ్ హీరోలకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

సదరు ఫొటోలో ఉన్న ఇద్దరు హీరోలు అప్పట్లో ఇంకా మీసాలు కూడా రాని కుర్రాళ్లుగా ఉన్నారు. ఓ హీరోకు ఇంకా మీసాలే రాలేదు. చక్కగా చేతులు కట్టుకుని అలా కెమెరా వైపు చూస్తుండగా, మరో హీరో నూనుగు మీసాలు, గడ్డంతో ఫొటోలో కెమెరా వైపు కాకుండా మరో వైపునకు చూస్తున్నాడు. ఇంతకీ ఆ ఫొటోలో ఉన్నది హీరోలెవరంటే..రామ్ చరణ్, శర్వానంద్.

RRR సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. చరణ్ నటించిన ‘ఆచార్య’ పిక్చర్ ఈ నెల 29న విడుదల కానుంది. ప్రస్తుతం రామ్ చరణ్ RC 15 ఫిల్మ్ లో యాక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ ..గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామ్ చేయనున్నాడు. ఇక శర్వానంద్ టాలీవుడ్ లో విలక్షణ కథానాయకుడిగా కొనసాగుతున్నారు. ఆయన నటిస్తున్న ‘ఒకే ఒక జీవితం’ పిక్చర్ తెలుగు, తమిళ్ భాషల్లో రిలీజ్ కానుంది.

వీరిరువురు కూడా సక్సెస్ ఫుల్ గా తమ కెరీర్ లో దూసుకుపోతున్నారు. వీళ్లు చక్కటి స్నేహితులు. శర్వానంద్ తొలిసారి వెండితెరను ఫేస్ చేసింది మెగాస్టార్ చిరంజీవితోనే కావడం విశేషం. ఓ యాడ్ షూట్ లో పాల్గొన్నాడు. రామ్ చరణ్, శర్వానంద్ ల క్యూట్ ఫొటో ప్రజెంట్ చర్చనీయాంశమవుతున్నది. వీరు చిన్న నాటి నుంచి స్నేహితులు. ఇప్పటికీ వీరి స్నేహం కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news