తాతయ్యకు చంద్రబాబు వెన్నుపోటు.. NTR ఎక్స్‌ప్రెషన్ అలానే ఉంది : RGV

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియా వేదికగా చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతీ విషయమై తన అభిప్రాయాలను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదిక గా ట్వీట్ చేస్తూ మీడియాలో హైలైట్ అవుతుంటారు. ముఖ్యంగా రాజకీయాల్లో వేలు పెడుతూ ఉంటారు. అయితే, తాజాగా నందమూరి కుటుంబం మరియు చంద్రబాబును టార్గెట్‌ చేశారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.

తాజాగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఎన్టీఆర్ పై చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోటోను RGV పోస్ట్ చేస్తూ, ‘తన తాతయ్యని గోరాతి ఘోరంగా టార్చర్ పెట్టి వెన్నుపోటు పొడిచి చంపేసిన నారా చంద్రబాబు నాయుడుని ఎలా ముందుపోటు పొడవాలన్నా నా మనసులోని ఆలోచనను, భలే పట్టాడ్రా RGV గాడు అన్నట్లుంది ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్’ అని ట్విట్ చేశారు. దీంతోపాటు తన ఇంటర్వ్యూ లింక్ ను పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్ట్‌ చూసిన టీడీపీ నేతలు ఫైర్‌ అవుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news