మొట్ట మొదటిసారిగా డబ్యూ డైరెక్టర్ తో చెర్రీ…!

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తోలి చిత్రం ‘చిరుత’ ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయినసంగతి తెలిసిందే. అయితే తోలి చిత్రం నుంచి ఇప్పుడు చేస్తున్న RRR చిత్రం వరకు చూసుకుంటే ప్రతి ఒక్క చిత్రం కూడా అంతో ఇంతో అనుభవం ఉన్న దర్శకుల తోనే పనిచేస్తూ వస్తున్నాడు. అయితే తాజాగా చెర్రీ ఎలాంటి అనుభవం లేని ఒక కొత్త దర్శకుడి తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు వివరాల్లోకి వెళితే… చరన నెక్స్ట్ వెంచర్ ని ప్రదీప్ అనే యువ దర్శకుడు తెరకెక్కించనున్నాడని ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. ఇప్పటికే ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని, లేటెస్ట్‌గా ఈ ప్రాజెక్ట్‌కి చిరంజీవి కూడా కొన్ని మార్పులు,చేర్పులు చేసి పచ్చ జెండా ఊపినట్లు ఫిల్మ్ వర్గాల టాక్. అలానే వీద్దరి కాంబినేషన్ లో రానున్న సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించనుందంటూ వినికిడి.

RRR షూటింగ్ పూర్తయ్యాక ఈ చిత్రం సెట్స్ పైకి వెళుతుందని 2021 ద్వితీయార్ధంలో ప్రేక్షకుల మందుకు వచ్చే అవకాశం ఉంటుంది అని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ త్వరలోనే చరణ్, ప్రదీప్ కాంబో మూవీపై మరింత క్లారిటీ వస్తుంది. మరి కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఓ డెబ్యూ డైరెక్టర్‌తో జట్టు కడుతున్న చరణ్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news