‘క్వీన్’ జయలలిత సీజన్ 2 వచ్చేస్తోంది..రమ్యకృష్ణ, సోనియా అగర్వాల్ ఫొటోలు వైరల్

-

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ‘క్వీన్’ వెబ్ సిరీస్ సీజన్ 1కు విశేష ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మేకర్స్ సీజన్ 2 తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ లో ‘జయలలిత’గా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తోంది.

ఈ సీజన్ 2 షూటింగ్ జరుగుతుండగా, ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న హీరోయిన్ సోనియా అగర్వాల్ ..రమ్యకృష్ణతో దిగిన ఫొటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా, అవి వైరలవుతున్నాయి. ఈ సిరీస్ లో సోనియా అగర్వాల్ కీలక పాత్ర పోషిస్తోంది.

ఇప్పటికే జయలలిత జీవితం ఆధారంగా చిత్రాలు వచ్చాయి. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించిన ‘తలైవి’ సినిమా కూడా జయలలిత బయోపిక్. కాగా, ‘క్వీన్’ వెబ్ సిరీస్ లో భిన్నమైన కోణంలో జయలలిత జీవితాన్ని మేకర్స్ చూపించబోతున్నారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news