రష్మిక మరో లక్కీ ఛాన్స్

-

కన్నడ భామ రష్మిక మందన్న తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకుంది. ఛలో, గీతా గోవిందం సినిమాలతో రెండు హిట్స్ తో రష్మిక తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. నాగార్జున, నాని కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ దేవదాస్ సినిమాలో కూడా రష్మిక నటిస్తుండగా విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా రష్మిక నటిస్తుంది.

ఇక ఇదే కాకుండా ఛలో డైరక్టర్ వెంకీ కుడుముల డైరక్షన్ లో నితిన్ హీరోగా వస్తున్న సినిమాలో రష్మిక ఫీమేల్ లీడ్ గా ఛాన్స్ దక్కించుకుందట. ఛలో సెంటిమెంట్ తో వెంకీ మళ్లీ రష్మికను రిపీట్ చేస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఛలో సినిమాతో సత్తా చాటిన వెంకీ కుడుముల రెండో ప్రయత్నంగా చేస్తున్న ఈ సినిమాపై అంచనాలున్నాయి.

అఆ తర్వాత సరైన హిట్ దక్కని నితిన్ కు రష్మిక లక్ తోడై ఈ సినిమా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను సుధాకర్ రెడ్డి నిర్మిస్తారని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news