‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే’ .. అటల్సేతుపై జర్నీపై రష్మిక కామెంట్స్

-

ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌’పై నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల ప్రయాణించింది. ఈ సందర్భంగా ఆమె వంతెనపై ప్రయాణ అనుభూతిని షేర్‌ చేసుకున్నారు. రెండు గంటల ప్రయాణాన్ని కేవలం 20 నిమిషాల్లోనే పూర్తి చేయొచ్చని ఎప్పుడైనా అనుకున్నామా అంటూ తన ఎక్స్పీరియెన్స్ పంచుకుంది. ఇలాంటివి సాధ్యమవుతాయని ఎవరూ అనుకోలేదని, ఇప్పుడు మనం ముంబయి నుంచి నవీ ముంబయికి సులువుగా ప్రయాణించవచ్చని చెప్పుకొచ్చింది.

ఇటీవల ఆమె ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఇప్పుడు మనల్ని ఎవరూ ఆపలేరని వ్యాఖ్యానించారు. యువ భారత్‌ దేన్నయినా సాధించగలదన్న రష్మిక.. గత పదేళ్లలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని చెప్పారు. దేశంలో మౌలికవసతులు, రహదారి ప్రణాళిక అద్భుతంగా ఉన్నాయన్న ఆమె.. అభివృద్ధికే ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది రష్మిక. ముంబయి నగరంలో నిర్మించిన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌’ ను జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశంలోనే పొడవైన వంతెన ఇది.

Read more RELATED
Recommended to you

Exit mobile version