బింబిసార మూవీ ఆఫర్ వదులుకున్న టాలీవుడ్ హీరో !

-

అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బింబిసారా చిత్రం భారీ అంచనాల మధ్య ఆగస్టు 5న గ్రాండ్ గా రిలీజ్ అయింది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్ లో కనిపించాడు. బింబిసార అనే రాజుగా తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశాడని టాక్ కూడా వినిపిస్తోంది. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం, బింబిసారా సినిమాకి మొదట

అనుకున్నది కళ్యాణ్ రామ్ నీ కాదట. కళ్యాణ్ రామ్ పాత్ర కోసం మొదట మరొక హీరో దగ్గరికి వెళ్ళగా ఆ హీరో రిజెక్ట్ చేయడంతో చివరికి ఆ కథ కళ్యాణ్ రామ్ నీ వరించిందట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ. కథ అంత సిద్ధం చేసుకుని వశిష్టు రవితేజ దగ్గరికి వెళ్ళగా అసలు తను ఈ కథకు సూట్ కానని అలాంటి పాత్రలు చేయలేనని చెప్పాడట.

అంతేకాదు వశిష్టు లాంటి కొత్త దర్శకుడు ఇంత విజువల్ వండర్ సినిమాని హ్యాండిల్ చేయలేడేమో అని రవితేజ అభిప్రాయపడ్డాడట. దాంతో అదే కథతో కళ్యాణ్ రామ్ దగ్గరికి దర్శకుడు వశిష్టు వెళ్ళాడట. కళ్యాణ్ రామ్ సినిమా ప్రొడక్షన్ కూడా చేయడానికి సిద్ధంగా ఉండడంతో ఈ సినిమా కళ్యాణ్ రామ్ చేతిలోకి వెళ్ళింది.

Read more RELATED
Recommended to you

Latest news