సెలబ్రేషన్స్‌లో శంకర్-రామ్ చరణ్..RC15 అప్‌డేట్ ఇదే

రామ్ చరణ్ ఇప్పుడు టాలీవుడ్ మెగా పవర్ స్టార్ మాత్రమే కాదు పాన్ ఇండియా స్టార్ అని చెప్పొచ్చు. RRR ఫిల్మ్ తో దేశవ్యాప్తంగా ఆయనకు క్రేజ్ ఏర్పడింది. రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ RC15. ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పిక్చర్ పైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకు స్టోరి అందిస్తుండగా, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తు్న్నారు. ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇక ఈ సినిమా అప్ డేట్ కోసం మెగా అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ పంచెకట్టులో సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్న పిక్చర్స్ లీక్ అయ్యాయి. అవి చూసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యారు.

RC15 పిక్చర్ షూటింగ్ ప్రజెంట్ పంజాబ్, అమృత్ సర్ ప్రాంతాల్లో జరుగుతున్నది. మంగళవారం ఈ చిత్ర షూటింగ్ సమయంలో సెలబ్రేషన్స్ జరిగాయి. మూవీ యూనిట్ సభ్యుల్లో ఒకరి బర్త్ డే కాగా, ఆ వేడుకల్లో హీరో, డైరెక్టర్ పాల్గొన్నారు.

సదరు బర్త్ డే బాయ్ కేక్ కట్ చేయగా, అందరూ బర్త్ డే విషెస్ చెప్పారు. హీరో, దర్శకుడికి కేక్ తినిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా బ్యూటిఫుల్ భామ కియారా అద్వానీ నటిస్తోంది. సునీల్, శ్రీకాంత్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు.