నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పడానికి కారణం..?

నమ్రత శిరోద్కర్.. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య మాత్రమే కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్ కూడా.. మహేష్ బాబు – నమ్రత కాంబినేషన్లో వచ్చిన వంశీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో సొంతం చేసుకోకపోవడం గమనార్హం. ఈ సినిమాతోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక న్యూజిలాండ్లో వంశీ సినిమా షూటింగ్ జరగగా ఆ సమయంలో మహేష్ – నమ్రతల ప్రేమ బంధం , పెళ్లి బంధంగా మారే అంతగా బలపడింది. మొదట నమ్రత.. మహేష్ పై తనకున్న ఇష్టాన్ని వెల్లడించగా మహేష్ కూడా పాజిటివ్ ఒపీనియన్ తెలిపారు. నిజానికి మహేష్ బాబు – నమ్రతల పెళ్ళికి నమ్రత కుటుంబం ఒప్పుకున్నా. మహేష్ బాబు కుటుంబం మాత్రం ఒప్పుకోలేదు.

చివరికి మహేష్ బాబు సోదరి మంజుల కారణంగా మహేష్ నమ్రతల పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించారు. అలా 2005వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీన చాలా సింపుల్గా మహేష్ బాబు నమ్రతల వివాహం జరిగింది . నిజానికి పెద్దలు జరిపించిన వివాహం కంటే ముందే ముంబైలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. కానీ అంతటా తెలిస్తే పరువు పోతుందని ఆలోచించిన కుటుంబ సభ్యులు మళ్ళీ అధికారికంగా వీరికి పెళ్లి జరిపించారు. అందరిలాగే చాలామంది హీరోయిన్ లు చేసే పని నమ్రత కూడా చేసిందని చెప్పవచ్చు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఈమెకు ఆఫర్లు వచ్చినా అన్నిటికి నో చెప్పారు నమ్రత.

ఇక మహేష్ బాబు కంటే నమ్రత వయసులో పెద్దది కావడం గమనార్హం. ఇక తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నమ్రత మాట్లాడుతూ..మహేష్ ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తారని, ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సమయం కేటాయిస్తారని నమ్రత తెలిపింది. ఇక గొప్ప మానవతావాది అని ఈ రీజన్ వల్లే మహేష్ అంటే ప్రేమ, ఆరాధన పెరిగాయి అని, ఇక మహేష్ ని చూసుకుంటూ ఉండిపోవాలనేసి ఆయనకి సంబంధించిన అన్ని విషయాలను దగ్గర ఉంటూ చూసుకుంటూ.. కుటుంబం బాధ్యతలు తీసుకున్నాను అంటూ తెలిపింది నమ్రత.అందుకే సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబ బాధ్యతలు తీసుకోవడం జరిగిందని స్పష్టం చేసింది.