నేడు అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుద‌ల అయిన దృశ్యం – 2

వెంక‌టేష్ ద‌గ్గుబాటి, మీనా ప్ర‌ధాన పాత్ర లో చేసిన దృశ్యం -2 సినిమా ఈ రోజు అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుద‌ల అయింది. ప్ర‌స్తుతం సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని వ్యూస్ ప‌రంగా దూసుకుపోతుంది. ఈ సినిమా 2014 లో దృశ్యం సినిమా కు సీక్వెల్ గా తెర‌కెక్కించారు. అలాగే ఈ సినిమా మ‌ల‌యాళ చిత్రం దృశ్యం -2 రిమేక్ గా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

కాగ మ‌లయాళం లో మోహ‌న్ లాల్ తో పాటు మీనా ప్ర‌ధాన పాత్ర లో న‌టించారు. ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి లో నే మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌ల‌యాళం లో పెద్ద హిట్ గా కూడా నిలిచింది. దీంతో ఈ సినిమా ను తెలుగు రీమెక్ చేస్తున్నారు. అయితే ఈ తెలుగు సినిమా లో హీరో రాంబాబు యే హ‌త్య చేశాడ‌ని ఐజీ గౌత‌మ్ సాహు సాక్షాల‌ను సంపాదిస్తాడు. దీంతో రాంబాబు ను పోలీసులు అరెస్టు చేస్తారు. దీంతో మ‌ళ్లి రాంబాబు త‌న కుటుంబాన్ని ఈ కేసు నుంచి ఎలా బ‌య‌ట ప‌డేశాడో అనేది క‌థ‌. అయితే ఈ సినిమా మొద‌టి పార్ట్ క‌న్న థ్రిల్లింగ్ గా ఉంటుంద‌ని అంటున్నారు.