ఆర్జివి మళ్లీ షాక్ ఇచ్చాడు..!

-

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ మాట మీద నిలబడే వ్యక్తి కాదని అందరికి తెలుసు. అనుకోవడం కాదు తాను మాట మీద నిలబడే వ్యక్తిని కాదని ఆర్జివినే ఒప్పుకుంటాడు. దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా సినిమాలు చేసె వర్మ లేటెస్ట్ గా తన నిర్మాణంలో భైరవగీత అనే సినిమా చేశాడు. సిద్ధార్థ్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ధనుంజయ్, ఇర్రా మోర్ లీడ్ రోల్స్ చేశారు.

ఈ సినిమా రిలీజ్ విషయంలో వర్మ చాలా కన్ ఫ్యూజ్ అవుతూ వచ్చాడు. వాయిదాల మీద వాయిదాలు వేస్తూ విసిగించాడు. ఫైనల్ గా నవంబర్ 30న భైరవ గీత రిలీజ్ ఫిక్స్ చేశాడు. రోబోకి సీక్వల్ గా వస్తున్న 2.ఓకి ధీటుగా ఆర్జివి భైరవగీత వస్తుందని అనుకున్నారు. అంతేకాదు మాది పెద్దల సినిమా మీది పిల్లల సినిమా అంటూ 2.ఓ మీద వర్మ కామెంట్ కూడా పెట్టాడు.

ఇదిలాఉంటే వర్మ సినిమా మళ్లీ వాయిదా పడినట్టు తెలుస్తుంది. డిసెంబర్ 7న ఈ సినిమా రిలీజ్ అవుతుందట. థియేటర్ల సమస్య వల్లే చివరి నిమిషంలో భైరవగీత రిలీజ్ వాయిదా పడిందని తెలుస్తుంది. ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఆర్జివి ప్రమోషన్స్ కూడా చేశాడు. కాని చివరకు రిలీజ్ మళ్లీ వాయిదా వేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news