వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ మీడియాలో హైలైట్ అవుతూనే ఉంటారు. ఏదేని విషయమై తనదైన అభిప్రాయాన్ని చెప్పి చర్చ జరిగేలా చేస్తుంటారు. తాజాగా ఈయన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ పై ఆసక్తికర అండ్ మెగా ఫ్యాన్స్ కు కోపం తెప్పించే కామెంట్స్ చేశారు.
ఈ నెల 18న ‘భలె భలె బంజారా’ అనే సాంగ్ ను ‘ఆచార్య’ నుంచి విడుదల చేయబోతున్నట్లు ఆ సినిమా మేకర్స్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోను చిరంజీవి షేర్ చేశారు. అందులో సాంగ్ గురించి రామ్ చరణ్, చిరంజీవి మాట్లాడుతుండగా డ్యాన్స్ లో తాను ‘తగ్గను’ అని రామ్ చరణ్ అన్నాడు. ‘తగ్గాలి’ అని చిరంజీవి చెప్పాడు. అలా వీరిరువురు కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘తగ్గేదేలే’ డైలాగ్ వాడారని అన్నారు.
వాళ్లు అలాంటి డైలాగ్స్ వాడటం వలన తాను హర్ట్ అయ్యానని, వాళ్లు అలా మాట్లాడటం ద్వారా బన్నీనే న్యూ మెగాస్టార్ అని చెప్పినట్టా అని ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. వర్మ ఇటువంటి క్వశ్చన్స్ పని లేక అడుగుతున్నాడని, వావ్ అని, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మెగా అభిమానులు మెగాస్టార్ చిరంజీవియే అని చెప్తున్నారు. వర్మ ఇలా ట్వీట్ చేసి మళ్లీ మెగా ఫ్యామిలీపైన కామెంట్స్ చేశారు.
I am Mega hurted that Mega father and Mega son in their talk on promotional video of తగ్గు తగ్గను for #Aacharya are using @alluarjun ‘s తగ్గేదేలే ..This makes me feel as if @AlwaysRamcharan and @KChiruTweets themselves are saying that ALLU is the NEW MEGA 😳 pic.twitter.com/9Yclx50Ro9
— Ram Gopal Varma (@RGVzoomin) April 16, 2022