వర్మ కన్నుల్లో పడ్డ.. డూప్లికేట్ చంద్రబాబు..!

-

మనుషులు పోలిన మనుషులు ఉంటారని తెలుసు.. అయితే అవసరానికి తగినట్టుగా వారిని వెతికిపట్టుకోవడం మాత్రం కష్టమే. ఫలానా వ్యక్తి లాంటి మనుషులను చూశామంటూ అనుకుంటారు. కొందరు ఒకేరకమైన మనుషులు ఎదురెదురు పడతారు. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే వర్మ తీయబోతున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాలో రీల్ చంద్రబాబుగా రియల్ లుక్ చంద్రబాబుని దించుతున్నాడు. అదెలా అంటారా ఎక్కడో ఎప్పుడో దొరికిన ఓ వీడియో ఆధారంగా వర్మ వేట మొదలు పెట్టాడు.

సరిగ్గా చంద్రబాబు డూప్లికేటు అదేనండి జిరాక్స్ కాపీలా ఉన్న ఒకతని వీడియో తన సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు వర్మ. సదరు వ్యక్తి సరిగ్గా చంద్రబాబులానే ఉండటం విశేషం. లాగా కాదు చంద్రబాబే అన్న నమ్మేలా ఉన్నాడు. అయితే వీడియోలో వ్యక్తి బనియన్, షాట్ మీద టిఫెన్ స్ప్లై చేస్తూ కనిపించాడు. ఈ వీడియో వర్మ దగ్గరకు ఎలా వచ్చిందో ఏమో కాని పడక పడక వర్మ కన్నుల్లో పడ్డాడు ఈ డూప్లికేట్ చంద్రబాబు. ఈ వ్యక్తిని కనిపెట్టి తమకు మెయిల్ చేస్తే అలా పంపించిన మొదటి వ్యక్తికి లక్ష రూపాయలు రివార్డ్ అందిస్తామని అన్నారు వర్మ.

బాలకృష్ణ తీస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా లక్స్మి పార్వతి ఎంట్రీ ముందుదాకా తీస్తున్నారని తెలుసుకున్న వర్మ ఆ తర్వాత స్టోరీని నేను చూపిస్తా అంటూ ఎన్.టి.ఆర్, లక్ష్మి పార్వతి పెళ్లి ఫోటోలతో పాటుగా ఫేస్ బుక్, ట్విట్టర్స్ లో కామెంట్స్ పెట్టాడు.

Read more RELATED
Recommended to you

Latest news