RRR చరణ్ ఫస్ట్ లుక్ అప్పుడేనా..!

-

రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా నుండి ఏ చిన్న వార్త వచ్చినా అది సెన్సేషనల్ అవుతుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతుంది. అయితే ఈ సినిమా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. రాం చరణ్ పాత్ర పేరు రామరాజు అని లీక్ అవగా సినిమాలో చరణ్ పోలీస్ గా కనిపిస్తాడని తెలుస్తుంది.

అయితే రాం చరణ్ కు సంబందించిన పోర్షన్ స్పీడ్ గానే కానిచ్చేస్తున్నాడట రాజమౌళి. అందుకే మార్చి 27న చరణ్ బర్త్ డే నాడు ఆర్.ఆర్.ఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారట. అయితే ఇది అంచనా మాత్రమే నిజంగా రాజమౌళి అంత త్వరగా ఆర్.ఆర్.ఆర్ పోస్టర్ వదులుతాడాన్న నమ్మకం లేదు. ఇక సినిమా కోసం ఎన్.టి.ఆర్ పూర్తిస్థాయి మేకోవర్ తో కనిపిస్తాడట.

ప్రస్తుతం ఎన్.టి.ఆర్ దుబాయ్ ట్రిప్ లో ఉన్నాడు. అక్కడ హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తూనే ఆర్.ఆర్.ఆర్ కోసం రెడీ అవుతాడట. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా షూటింగ్ పూర్తి చేసి అనుకున్న విధంగా 2020 సమ్మర్ లో ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news