ఆ టాకీసులో ‘ఆర్ఆర్ఆర్’ ఫస్ట్ హాఫ్ మాత్రమే.. ఫైర్ అవుతున్న నెటిజన్లు..

-

ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ పెంచడమే కాదు.. భారతీయ చిత్ర ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసి భారత దేశంలోనే నెంబర్ వన్ డైరెక్టర్‌గా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో నిలిచిపోయాడని చెప్పొచ్చు. ఆయన తీసిన మూడు గంటల నిడివి ఉన్న పిక్చర్ చూసి జనాలు ఆ ఊహాలోకంలోనే ఉండిపోతున్నారు. థియేటర్ల వద్ద సినీ లవర్స్ మూవీ చూసేందుకు క్యూ కడుతున్నారు. ఇక ఈ చిత్రం తొలిరోజే ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు చేసిందని సినీ పరిశీలకులు చెప్తున్నారు.

బాక్సాఫీసును బద్దలు కొడుతున్న ఈ చిత్రం చూసేందుకు జనాలు ఓ వైపు ఆసక్తి చూపుతున్నారు. మరో వైపున ఆ థియేటర్‌లో మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ ఫస్ట్ హాఫ్ మాత్రమే ప్రదర్శితమయిందట. దాంతో జనాలు ఇక సినిమా అయిపోయిందనుకుని వెళ్లిపోయారట. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. అగ్రరాజ్యం అమెరికాలోని ఓ థియేట‌ర్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా సెకండ్ హాఫ్‌ను వేయనేలేదు. దాంతో పిక్చర్ చూసేందుకు వచ్చిన వారు ఫస్ట్ హాఫ్ మాత్రమే చూసి వెళ్లిపోయారు.

ఇలా చిత్రం ఫస్ట్ హాఫ్ మాత్రమే చూసి వెళ్లపోవడానికి గల కారణం హాలీవుడ్ సినిమాలట. ఎందుకటే సాధారణంగా ఇంగ్లిష్ సినిమాల నిడివి గంట నుంచి గంటన్నర మాత్రమే ఉంటుంది. అలా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కూడా గంటన్నర నిడివిలోనే అయిపోయిందని అనుకున్నట్లున్నారు. అలా వారు సెకండ్ హాఫ్ గానే స్క్రీనింగ్ చేయలేకపోయారు. అయితే, ఫస్ట్ హాఫ్ అనగా ఇంటర్వల్ వరకు చిత్రం అయిపోగానే సినిమా అయిపోయింద‌ని ఆ థియేట‌ర్ మేనేజ్‌మెంట్ భావించింద‌ట‌.

సెకండ్ హాఫ్ కూడా ఉంద‌ని తమకు ఎటువంటి సూచనలు రాలేదట. ఈ విషయం సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులకు తర్వాత థియేటర్ యాజమాన్యం చెప్పడంతో వారు ఆశ్చర్యపోయారని తెలుస్తోంది. ఈ విషయం అమెరికాలోని సినీ మార్క్ థియేటర్‌లో జరిగిందని ఫిల్మ్ క్రిటిక్ అనుప‌మా చోప్రా తెలిపింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. ఈ విషయం తెలుసుకుని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు థియేటర్ యాజమాన్యంపై ఫైర్ అవుతున్నారు. సెకండ్ హాఫ్ లో ఉన్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ లను ఫస్ట్ డే రోజు సినిమా చూసిన ప్రేక్షకులు మిస్ అయ్యారని చెప్తున్నారు. వారికి సెపరేట్ గా సెకండ్ హాఫ్ మళ్లీ థియేటర్ యాజమాన్యం ఫ్రీగా చూపించాలని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news