మాస్ రాజాతో ఆరెక్స్ భామ

-

ఆరెక్స్ 100 సినిమాతో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీగా మారిన పాయల్ రాజ్ పుత్ తెలుగులో మంచి అవకాశాలను అందుకుంటుంది. ఆరెక్స్ 100 సక్సెస్ లో అమ్మడి పాత్ర ఎంత ఉందో అందరికి తెలిసిందే. అందుకే ఆమెకు వరుస ఛాన్సులు ఇస్తున్నారు. ఈమధ్య టాలీవుడ్ ఈవెంట్స్ లో కూడా పాల్గొంటున్న అమ్మడు ఇక్కడ నీళ్లు బాగా పడినట్టు ఉన్నాయి. ప్రస్తుతం సి. కళ్యాణ్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్న పాయల్ లేటెస్ట్ గా మాస్ మహరాజ్ రవితేజ సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుందట.

వి.ఐ. ఆనంద్ డైరక్షన్ లో రవితేజ హీరోగా వస్తున్న సినిమా డిసెంబర్ లో మొదలు కానుంది. ఈ సినిమాను రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. సినిమాలో రవితేజతో రొమాన్స్ కు రెడీ అవుతుంది పాయల్ రాజ్ పుత్. ఇప్పటికే ఈ సినిమాలో నన్ను దోచుకుందువటే హీరోయిన్ నభా నటేష్ ఒక హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. పాయల్ సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో ఆమెకు మంచి రోల్ దక్కిందని తెలుస్తుంది.

నవంబర్ 16న అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో వస్తున్న రవితేజ ఆ సినిమా మీద భారీ హోప్స్ తో ఉన్నాడు. శ్రీను వైట్ల డైరక్షన్ లో వస్తున్న ఆ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news