అమ్మాయిల లోదుస్తుల గురించి నటి బోల్డ్ పోస్ట్..నెట్టింట వైరల్

-

నటి సాయి తమ్హంకర్ హిందీతో పాటు మరాఠి భాషలో పలు చిత్రాలు చేసి ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. సోషల్ మీడియాలో ఈ సుందరికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తుంటుంది ఈ భామ. కాగా, తాజాగా ఈ భామ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

సాయి తమ్హంకర్ తన స్నేహితురాలు మాలిని అగర్వాల్ తో కలిసి ఓ వీడియోలో లిప్ సింక్ చేసి నటించారు. దానిని ఇన్ స్టా వేదికగా షేర్ చేయగా, అది అమ్మాయిలందరికీ రిలేట్ అవడంతో దానిని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు. ఈ పోస్టులో నటి సాయి.. అమ్మాయిల లో దుస్తులు, బ్రాల గురించి బోల్డ్ గా చర్చించడం చర్చనీయాంశమవుతున్నది.

మీరు ఎందుకు మీకు ఇష్టమైన బ్రా లను ఉతకబోరు? అని ప్రశ్నించగా, సాయి తమ్హంకర్, మాలిని అగర్వాల్..అలా చేయడం మాకు మంచిగా అనిపిస్తుంది..ఫుల్ మజా వస్తుంది అని చెప్పిన డైలాగ్స్ కు వారు లిప్ సింక్ ఇచ్చారు. ఆ డైలాగ్స్ బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ‘అంజమ్’ చిత్రంలోనివి. కాగా, ఈ పోస్టును చూసి చాలా మంది అమ్మాయిలు రియాక్ట్ అవుతున్నారు.

ఒకవేళ ఇంకో వాషింగ్ మెషీన్ లో తమకు ఇష్టమైన ఫ్యాన్సీ లోదుస్తులు, బ్రాలు వేసినట్లయితే అవి నాశనమయిపోతాయనే భయం ఉందా? మీకు నచ్చిన లో దుస్తులు ఉతుక్కుని ఎన్ని రోజులవుతుంది? అని క్యాప్షన్ లో నటి సాయి, మాలినిలు ప్రశ్నించారు. ఈ పోస్టుపై అమ్మాయిలు స్పందిస్తూనే ఉన్నారు. తాము కూడా ఇలానే చేస్తామన్నట్లు కొందరు అమ్మాయిలు రిప్లయి ఇస్తున్నారు. నటి ఇలా లో దుస్తుల గురించి మాట్లాడుతూ వీడియో చేయడం వలన అది సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నదని మరి కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నటి సాయి తమ్హంకర్ ఇటీవల ‘మిమి’ చిత్రానికి గాను ఈ ఏడాది ఐఫా అవార్డ్స్ లో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అవార్డు అందుకుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news