బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్..హోస్టింగ్ కింగ్ అన్న సంగతి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనాలను ఎంటర్ టైన్ చేయడంలో సల్లూ భాయ్ ఎప్పుడూ ముందుంటారు. తన సినిమాలతో పాటు హోస్టింగ్ తో ప్రజలను అలరిస్తుంటాడు. కాగా, సల్మాన్ భాయ్ తాజాగా ఓ వేదికపైన తన కెరీర్ తొలి నాళ్ల సంగతులు గుర్తుకు తెచ్చుకుని కన్నీటి పర్యంతమయ్యాడు.
ఐఫా అవార్డ్స్ ఈవెంట్ ఈ ఘటన జరిగింది. బాలీవుడ్ మెగా స్టార్ సల్మాన్ ఖాన్ ఈ అవార్డ్స్ వేదికగా భావోద్వేగానికి గురయ్యారు. తన కెరీర్ స్టార్ట్ అయిన తొలి నాళ్ల సంగతులు గుర్తుకు తెచ్చుకున్నారు. తన ‘మైనే ప్యార్ కియా’ ఫిల్మ్ సూపర్ హిట్ అయినప్పటికీ తనకు అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదని చెప్పుకొచ్చారు.
ఆ టైంలో డైరెక్టర్ రమేశ్ తనకు చక్కటి అవకాశం ఇచ్చారని గుర్తుకు తెచ్చుకుని థాంక్స్ చెప్తూ కన్నీరు పెట్టుకున్నారు. ఇక తన కెరీర్ ఎండ్ అవుతుందనుకున్న టైంలో ‘వాంటెడ్’ ఫిల్మ్ ను తనతో తీసిన ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తన స్పీచ్ లో తనకు అండగా నిలిచిన సునీల్ శెట్టి, అనిల్ కపూర్ లకు థాంక్స్ చెప్పాడు సల్లూ భాయ్.
View this post on Instagram