ఉత్తర కొరియా అణుపరీక్ష.. మూడు సొరంగాలను కూడా తవ్విందంట!

-

ఉత్తరకొరియా అణుపరీక్షకు మూడు సొరంగాలు కూడా సిద్ధం చేస్తున్నట్లు అమెరికాకు చెందిన ‘ది సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’ వెల్లడించింది. ఈ మేరకు ప్యూంగేరీ పరీక్షా కేంద్రంలో మూడో సొరంగం ఇప్పటికే పూర్తయింది. అలాగే అణుపరీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరీక్షా కేంద్రంలో రెండు టన్నెళ్లను ఏర్పాటు చేసి.. అణు కార్యక్రమాలకు వినియోగించనున్నారు.

ఉత్తర కొరియా అణుపరీక్ష-సొరంగాలు
ఉత్తర కొరియా అణుపరీక్ష-సొరంగాలు

మూడో నంబర్ టన్నెల్ వద్ద కొన్ని చెట్లు, నిర్మాణాలు, పొదలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో అణు పరీక్షలపై స్వీయ ఆంక్షలు విధించుకొన్న ఉత్తరకొరియా ఇటీవల వాటిని తొలగించింది. అణు పరీక్షలకు సంబంధించి విధించుకొన్న ఆంక్షలకు కట్టబడి ఉండమని కిమ్ తెలిపారు. ఆ తర్వాత క్షిపణుల ప్రయోగాన్ని ప్రారంభించారు. కాగా, 2006-17 వరకు ఆరు అణు పరీక్షలను నిర్వహించింది. అయితే ఉత్తర కొరియా ఎప్పుడైనా అణు పరీక్షలు నిర్వహించవచ్చని దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు. పరీక్షల సమయాన్ని కిమ్ నిర్ణయిస్తారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news