హై – సెక్యూరిటీతో హైదరాబాదులో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్

-

సల్మాన్ ఖాన్ షూటింగ్ అయ్యేంత వరకు దాదాపు నెల రోజుల పాటు రామోజీ ఫిలిం సిటీ చుట్టూ భద్రతా వలయం ముంబై పోలీస్ శాఖ ఏర్పాటు చేసినట్లు సమాచారం అందుతోంది. హైదరాబాద్ లో జరగబోయే షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. అంత మాత్రమే కాదు ఈ సినిమాలో కీలక పాత్రలో విక్టరీ వెంకటేష్ కూడా నటించనున్నారు. సల్మాన్ అదేవిధంగా వెంకటేష్ లకి సంబంధించి సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో షూట్ చేయనున్నట్లు సమాచారం అందుతోంది. భారీ భద్రత మధ్య సల్మాన్‌ ఖాన్‌ హైదరాబాద్‌ చేరినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి మెయిన్ హీరో గా నటిస్తున్న గాడ్ ఫాదర్ లో.. సల్మాన్ ఖాన్ కూడా కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి, సల్మాన్ కి సంబంధించిన సన్నివేశాలు గతంలోనే ముంబైలో షూట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సల్మాన్ హైదరాబాద్ రావటంతో.. ఒక స్పెషల్ సాంగ్ షూట్ చేయబోతున్నారట. ప్రభుదేవా కొరియోగ్రఫీ ఆధ్వర్యంలో.. ఈ సాంగ్ షూటింగ్ జరుగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంమీద చంపేస్తామని లెటర్ రాయడం తో ఇప్పుడు సల్మాన్ హైదరాబాద్ లో ఎంట్రీ అవడంతో పూర్తి భద్రతా వలయంలో ఆయన చేయబోయే షూటింగ్ ప్రాంతాలు ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news