టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధ పడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధికి సామ్ చికిత్స కూడా తీసుకుంటోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ సినిమాలకు ఒక సంవత్సరం గ్యాప్ తీసుకుని ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్తోందనే ప్రచారం జరిగింది. కానీ ఈ భామ మాత్రం ప్రస్తుతం తన వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది.
అయితే సామ్ తన మయోసైటిస్ ట్రీట్మెంట్ గురించి వచ్చిన ఓ రూమర్ గురించి తాజాగా రియాక్ట్ అయింది. తన ట్రీట్మెంట్ కోసం ఆమె ఓ స్టార్ హీరో దగ్గర అప్పు తీసుకున్నానంటూ వచ్చిన వార్తలను ఖండించింది. ఇన్‌స్టా వేదికగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది ఈ అమ్మడు.
“మయోసైటిస్ చికిత్స కోసం రూ.25 కోట్లా!? ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇందులో నేను ఖర్చు కొంచం మాత్రమే పెడుతున్నాడు. నా కెరీర్లో సంపాదించిన మొత్తాన్ని ఖర్చు చేశానని నేను అనుకోవడం లేదు. నేను నా జాగ్రత్తలు చూసుకోగలను. మయోసైటిస్ అనేది ఓ సమస్య. వేలాది మంది దీనితో బాధపడుతున్నారు. చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసే ముందు దయచేసి కాస్త బాధ్యతగా ఉండాలి”అని సమంత పోస్టు పెట్టింది.