అది నిజం కాదంటూ.. రూమర్స్ పై సమంత క్లారిటీ

-

కెరీర్ లో సూపర్ ఫాస్ట్ గా దూసుకెళ్తున్న సమయంలో టాలీవుడ్ సూపర్ స్టార్ సమంత మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడింది. సామ్ ఎప్పుడైతే ఈ ఆటోఇమ్యూనీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా చెప్పిందో.. అప్పటి నుంచి మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం చేస్తున్న సినిమాలే కాదు, ఇప్పటికే సమంత ఒప్పుకొన్న సినిమాలపైనా సందిగ్ధత ఏర్పడింది. ముఖ్యంగా కొన్ని బాలీవుడ్‌ ప్రాజెక్టుల నుంచి ఆమె వైదొలగనున్నట్లు రీసెంట్ గా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై సమంత ప్రతినిధి క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని చెప్పారు.

‘‘సమంత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. సంక్రాంతి తర్వాత విజయ్‌ దేవరకొండతో కలిసి ఆమె ‘ఖుషి’ షూటింగ్‌లో పాల్గొంటారు. అది పూర్తయిన వెంటనే ఇప్పటికే ఆమె ఒప్పుకొన్న బాలీవుడ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. జనవరి నుంచి సమంత ఒక హిందీ మూవీ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అది సాధ్యపడటం లేదు. బహుశా ఆ సినిమా షూటింగ్‌ మరో ఆర్నెల్లు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్‌, మే నుంచి ఆమె హిందీ మూవీ చిత్రీకరణలో పాల్గొనవచ్చు’’ అని సమంత ప్రతినిధి వివరించారు.

‘‘ఎంతో కష్టంతో కూడుకున్న సినిమా షూటింగ్‌ కోసం ఒకరిని వేచి ఉండేలా చేయడం భావ్యం కాదు. ఎందుకంటే ఎంతోమంది ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఒకవేళ వేచి చూడటం సాధ్యం కాకపోతే, వారి షెడ్యూల్‌ ప్రకారం షూటింగ్‌ చేసుకోమని ఇప్పటికే స్పష్టత ఇచ్చాం.  ఇప్పటివరకూ సమంత ఒప్పుకొన్న ఏ ప్రాజెక్ట్‌ నుంచీ వెళ్లిపోలేదు. అలాగే కొత్త ప్రాజెక్టులను ఒప్పుకోలేదు. సమంత తర్వాతి సినిమాల విషయంలో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని సమంత టీమ్ క్లారిటీ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news